జై భీమ్ సినిమా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది????
సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, న్యూస్ చానల్స్ లో ఎన్నో చర్చలకు దారి తీసింది.
ప్రజలలో కూడా ఆదరణ పొందింది.
ఈ సినిమా ఇంత గొప్ప ఆదరణ పొందడం ఒక గౌరవం అని చెప్పచ్చు.
ఎందుకంటే ఈ సినిమాలో రెగ్యులర్ సినిమాల డాన్స్, ఫైట్లు లాంటివి లేవు.కేవలం
ఒక సామాజిక సమస్యను కథగా ఎంచుకున్నారు. అది కూడా ఒక నిజజీవిత సంఘటన.
ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు ఎవరు లేరు ఒక్క సూర్య మరియు ప్రకాష్ రాజ్ తప్ప.
ఈ సినిమాలో ఎంచుకున్న అంశం ప్రేక్షకులకు నచ్చేలా తీయడం చాలా కష్టం.
ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరించడం చాలా మంచి శుభ పరిణామం.
ఇక సినిమా కథ
విషయానికి వస్తే ఒక గిరిజన పేద మహిళ, అన్యాయంగా తన భర్త మీద జరిగిన కుట్రను ఏ విధంగా ఎవరి సహాయంతో గెలిచింది. ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి ఆమెకు మద్దతుగా నిలిచి న్యాయాన్ని అందించడానికి సామాన్యుల కోసం పోరాడే ఒక గొప్ప లాయర్ ఏ విధంగా ఆమెకు న్యాయాన్ని అందించాడు అసలు తన భర్త ఏమయ్యడో తెలియక అయోమయం లో
వున్న ఆమెకు ఎటువంటి న్యాయం జరిగింది.
అసలు ఆమె కు కావలసిన న్యాయం ఎమిటి అనేది చాలా బాగా చూపించారు.
ఇదే కాకుండా కేసు గురించి లాయర్ ఎలా ఆలోచించాడు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అనేది కొన్ని ట్విస్ట్స్ తో ఆకట్టుకునే విధంగా చాలా భాగా చూపించారు.
ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన అని మనం చెప్పుకున్నాం కదా.
ఇది సామాజిక పోరాటం చేసి ఎందరికో న్యాయం చేసిన లాయర్ చంద్రు గారి జీవితంలో ఎదురైన ఒక్క కేసు మాత్రమే.
లాయర్ చంద్రు గారి గురించి మనకు పెద్దగా ఏమి తెలియదు. చంద్రు గారు ఇటువంటి ఎన్నో కేసులు చేధించారు. ఎంతో మంది పేద, గిరిజన మరియు వెనుక బడిన వర్గాల వారికి సహాయం చేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చంద్రు గారు తమిళనాడు హై కోర్ట్ జడ్జి గా సేవలందించారు.
ఆయన జడ్జి గా ఉన్నపుడు అనేక గొప్ప నిర్ణయాలు గొప్ప తీర్పులు ఇచ్చారు.
ఎంతో దైర్యంగా కేసులు విచారించి పేదలకు న్యాయం చేశారు.
ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జడ్జి గా ఉన్నపుడు 96,000 కేసులకు తీర్పులు ఇచ్చారు. ఎంతో మందికి న్యాయం జరిగింది. ఆయన జడ్జి గా రిటైర్ అయిన తరువాత కూడా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే వారు . పేద వారి కోసం పోరాటాలు చేశారు. మానవ హక్కుల గురించి కూడా ఉద్యమాలు చేశారు.
స్వార్థ పూరితమైన వ్యవస్థను మార్చడం చాలా కష్టం కనీసం పేద వారికి సహాయం అందించి న్యాయం చేయడం ద్యారా కొంత వరకు వారి సమస్యలు తిర్చగలం. మరియు సామాజిక న్యాయం అందరికీ జరగాలి. కొన్ని వర్గాల వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది అని మన అందరికీ తెలుసు ఇది ఎవరికి తెలియని విషయం కాదు అందరికీ తెలిసిన విషయమే న్యాయ వాదులకు తెలుసు. కొన్ని సార్లు న్యాయ మూర్తులకు తెలుసు కానీ చట్టం వున్న కొన్ని లొసుగులు అడ్డు పెట్టుకొని వారికి కావలసిన విధంగా తీర్పులు వచ్చేలా చేసుకుంటూ వారికి పడాల్సిన శిక్షలు తగ్గించుకోవడం లేదా శిక్ష నుండి తప్పించు కోవడం లేదా వేరొకరి మీద ఆ కేసును వచ్చేలా చేసి అమాయకులను శిక్ష పడేలా చేయడం చేస్తున్నారు.
చంద్రు గారు ప్రముఖ వార్తా పత్రిక లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమా గురించి మాట్లాడుతూ "ఇటువంటి సినిమా లు చాలా రావాలి. సామాజిక సృహ తో సినిమాలు తీయాలి.
ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి కాక ఒక సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక లాయర్ ఒక నిజాన్ని నిరూపించడం ఎంత కష్టమో ఎన్ని అవరోధాలు దాటలో మీకు అర్థం అవుతుంది. ఒక లాయరే కాదు ఒక వ్యక్తి నిజాన్ని నిరూపించడం చట్టానికి వ్యతిరేకంగా పోరాడటం అంత సులువు కాదు. నేను ఎన్నో బెదిరింపులు, అవమానాలు ఎదురు కొన్నాను.
అయితే వాటిని ఎదుర్కొని నిజాలు నిరూపించకోవాల్సిన వచ్చేది అని చంద్రు గారు వివరించారు".
ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా.ఇది సినిమా కాదు ప్రతి సామాన్యుడి ఆవేదన,రోదన. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కటే ఆలోచన వారి మనసులో ఏర్పడుతుంది ఇది ప్రతి సామాన్యుడి జీవితం, కానీ ఈ సినిమా లో చూపినట్టు అందరికీ న్యాయం జరుగుతుందా అని. చట్టం ముందు అందరూ సమానమే ఏ ఒక్కరి కోసం దాని అవహేళన చేయకూడదు సామాజిక న్యాయం అందరికీ జరగాలి అనే
ఉద్దేశ్యం తో ఈ చిత్రం నిర్మించారు మరియు నటించారు సూర్య.
ప్రతి ఒక్కరూ చూసి వారి ప్రయత్నాన్ని గుర్తించాలి అని కోరుకుంటున్నాం.
