Type Here to Get Search Results !

బ్యాంకు లను ప్రైవేటీకరణ చేయడం అవసరమా

 బ్యాంకు లను ప్రైవేటీకరణ  చేయడం అవసరమా??

బ్యాంకు లను ప్రైవేటీకరణ చేయడం అవసరమా

బ్యాంకుల ప్రైవేటీకరణ అవసరమా అంటే ప్రభుత్వం అవసరమే అంటుంది. కానీ ఆర్థిక వేత్తలు, మేధావులు మరియు ఉద్యోగులు చాలా తప్పుడు నిర్ణయం అని అంటున్నారు. ఎవరిది నిజం తెలుసుకుందాం.


దేశ ఆర్థిక అభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వం తోనే వుండాలని అప్పుడే అందరికీ ఆర్థిక వనరులు అందుతాయని భారత రాజ్యాంగ నిర్మాత Dr. అంబేద్కర్ గారు తన రచన "స్టేట్స్ and అఫ్ఫైర్స్ " లో పేర్కొన్నారు. అదే విధంగా రాజ్యాంగ సభకు కూడా సమర్పించారు. కానీ ఆయన ప్రస్తావించిన చాలా అంశాలు రాజ్యాంగం లోనికి రాలేదు.

కానీ ఈ అంశాలను పరోక్షంగా ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 38 లో పొందుపరిచారు. అందులో ఒక్క వాక్యం చూస్తే సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో అందరికీ సామాజిక న్యాయం అందాలని దాని కోసం ప్రభుత్వం విశేష కృషి చేయాలని అలాగే దేశంలోని ప్రాంతాలు, వ్యక్తులు మరియు సమూహాల మధ్య అసమానతలు తొలగించాలి పేర్కొంది.


కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమే కాక సామాజిక న్యాయానికి పూర్తిగా విరుద్ధం. పబ్లిక్ రంగంలో వున్న పరిశ్రమలు, విమానయాన, రైల్వే లను ఇంకా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తొందర పడుతుంది. వాటిలో భాగంగా బ్యాంకుల ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేయడం. ఇది కొంత మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ బి.జే.పి పూర్వ చరిత్ర తెలిసిన వారికి కాదు.


ఎందుకంటే మొదటి నుంచి, అంటే  భారతీయ జనతా పార్టీ ఒకప్పటి  జన్ సంఘ్ గా ఉన్నపుడు కూడా దీనిని వ్యతిరేకించారు. 1969 లో కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే జాతీయ బ్యాంక్ గా ఉన్నపుడు కొన్ని ప్రైవేటు బ్యాంకులను జాతీయ బ్యాంకుల హోదా కల్పించాలని అప్పటి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి గా వున్నపుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు ప్రేవేశపెట్టినపుడు జన్ సంఘ్ దీనిని వ్యతిరేకించింది. అప్పటి జన్ సంఘ్ నాయకులు అటల్ భిహరి వాజ్ పాయ్ మరియు కొందరు నాయకులు దీనిని వ్యతిరేకించారు. జాతీయం చేయడం , ప్రజా వ్యతిరేక మరియు దేశ వ్యతిరేక బిల్లు అని పేర్కొన్నారు. కానీ కేంద్రం లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ వుండటం వలన ఈ బిల్లు ఆమోదం పొందుతుంది.

  • 1969 ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే జాతీయ బ్యాంక్ గా వుండేది. తరువాత కొన్ని ప్రైవేటు బ్యాంకులు జాతీయ బ్యాంకులు గా మారాయి. 1969 ముందు కేవలం 8 వేల బ్రాంచీలు వున్న బ్యాంకింగ్ సంస్థలు 2021 నాటికి ఒక్క లక్ష 18 వేల బ్రాంచీలు ఏర్పడ్డాయి.

  • బ్యాంకుల జాతీయ కరణ వల్ల అనేక మంది పేదలు, రైతులు మరియు కార్మికులు లబ్ధి పొందారు. పేద మరియు  మధ్య తరగతి ప్రజలకు రుణాలు అందాయి.

  • పేద పిల్లలకు మరియు కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అయ్యాయి. 

  • వెనుక బడిన కులలైన S.T. , S.C. మరియు B.C వారు కూడా ఉద్యగాలు పొందగలిగారు.

ఏది ఏమైనా ప్రస్తుతం అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ  బ్యాంకుల ప్రైవేటీకరణ చేయాలని గట్టి పట్టుదల తో  వ్యవహరిస్తుంది. 

దీనికి వాళ్ళు చెప్పే  కారణం ఏంటంటే " ప్రభుత్వ బ్యాంకులు సమర్ధంగా పని చేయడం లేదని అందుకే వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నామని తద్వారా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు".


నిజానికి ఈ వాదన అర్ధం లేనిది. ఇది సరైన కారణం కాదని ఎంతో మంది మేధావులు , ఆర్థికవేత్తలు మరియు నిపుణులు విశ్లేషిస్తున్నారు.


నిజానికి ప్రైవేటు బ్యాంకులు ఎక్కువగా దివాలా తీస్తున్నాయి. 

1960 దశకం నుంచి చూస్తే ఇప్పటి వరకు అనేక బ్యాంకులు దివాలా తీశాయి. వాటి లో కేవలం 25 బ్యాంకుల లకు  సంబంధించిన సాక్షాలు మరియు ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ బ్యాంకులలో వున్న డిపాజిట్ దారులు మరియు ఖాతా దారులు నష్ట పడకుండా వుండటానికి ప్రభుత్వం  ఈ ప్రైవేటు బ్యాంకులను ఆదుకొని ఖాతా దారులు నష్టపోకుండా చేసింది.  



ఇక ప్రభుత్వ బ్యాంకు ల విషయానికి వస్తే ఇవి నష్ట పోలేదా అంటే , దానికి సమాధానం నష్ట పోయాయి అని చెప్పక తప్పదు. దీనికి ప్రధాన కారణం కొన్ని కార్పొరేట్ సంస్థలు అని చెప్పక తప్పదు. 

ఎందుకంటే 

బ్యాంక్ ఉద్యగ సంఘాలు  తెలిపిన  వివరాల ప్రకారం దాదాపు 68 వేల కోట్ల రూపాయలు కేవలం 50 కార్పొరేట్ సంస్థలు ఎగవేసాయి. ఇవే కాకుండా దేశం లోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థలు మొత్తం 13 బ్యాంకు లల్లో 4 లక్షల 46 వేల కోట్ల రూపాయలు అప్పు చేశాయి.  వాటిలో 2 లక్షల 80 వేల కోట్ల రూపాయలు  మాఫీ చేసింది .కేవలం లక్ష 66 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. దీని ప్రకారం చూస్తే ఆ 2 లక్షల 80 వేల కోట్లు బ్యాంకులు నష్ట పోయాయి

వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు.


ఇది రాజకీయ తప్పిదమా ? బ్యాంకుల తప్పిదమా ? లేదా అప్పులు చెల్లించని ఆ బడా కార్పొరేట్ కంపనీల దా ? అంటే అందరి బాధ్యత కచ్చితంగా వుంది. 

ప్రభుత్వ బ్యాంకు లను ప్రైవేటీకరణ చేస్తే మీసాలు పెరిగిపోతాయి. డిపాజిట్ దారులు మరియు ఖాతా దారులు నష్టపోతారు. బ్యాంకు ఉద్యోగులు మరియు ఆర్థిక వేతలు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తీవ్ర నిరసన తెలుపుతున్నారు. 

వీటిని ప్రభుత్వం పరిగణ లోనికి తీసుకోవాలి కోరుకుందాం. 

లేక పోతే రైతు చట్టాల వలె వీటిని చివరి వరకు లాగి రద్దు చేస్తారేమో చూడాలి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం వాళ్ళు సమ్మెలు చేస్తే కుదురుకుంట్టున ఆర్థిక వ్యవస్థ కు చాలా నష్టం కలిగించే అవకాశం ఉంది.




Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.